సమంత నాగచైతన్య ఇష్యు…..ఇంత చిన్న కారణంకే విడిపోతారా ???

Samantha – Naga Chaitanya : సమంత నాగచైతన్య ఇష్యు ఇప్పటికీ టాలీవుడ్ లో హాట్ డిబేట్ లాగా జరుగుతుంది.. ఈ బ్యూటిఫుల్ జోడి బ్రేకప్ చెప్పుకోవడం ఫాన్సను ఇప్పటికి డిసప్పాయింట్ చేస్తుంది.. అయితే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలీదు.. దాంతో వీళ్ళ విషయంపై రోజుకో తీరుగా సోషల్ మీడియాలో రాస్తున్నారు..!సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు సమంత తన పేరు పక్కన ఉన్న అక్కినేని అనే పేరును తొలగించింది.. అప్పుడే ఈ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వివాదానికి నాంది మొదలైంది.. ఆ తర్వాత సమంత చైతుకు తెలియకుండా గోవా ట్రిప్ వెళ్ళింది.. ఆ విషయం తెలిసి చైతు సమంత పై గొడవ పడ్డాడట.. నాగార్జున బర్త్డే వేడుకలకు కూడా సమంత రాలేదు.. ఇది చాలదు అన్నట్టు రిజిస్ట్రిక్షన్ లో ఉండడం నాకు ఇష్టం లేదు అని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య దూరం ఉందని తెలియజేస్తూ వచ్చాయి.. మరోవైపు సమంత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.. చైతన్య కూడా లవ్ స్టోరీ సినిమాలో బిజీగా ఉన్నాడు.. అప్పుడే వీరిద్దరి మధ్య రియల్ గ్యాప్ ఉందని అంతా అనుకున్నారు..లవ్ స్టోరీ ట్రైలర్ చూసి సమంత చేసిన మేసేజ్ కి నాగ చైతన్య ఇచ్చిన రిప్లై కామెంట్ అప్పట్లో బాగానే వైరల్ అయింది.. ఇక సమంత సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా అక్కినేని ఫ్యామిలీ అంతను విమర్శించినట్లు తెలుస్తోంది.. అయితే సమంత వారి రిజిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వకుండా ఉండటమే వారి విడాకులకు బలం చేకూరిందట.. అప్పటికే చై సామ్ వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఓ రేంజ్ లో ఉన్నాయి.. అది చాలదన్నట్టు.. నాగచైతన్య ఒక టాప్ హీరోయిన్ తో ఒక సినిమా చేయడానికి సంతకం పెట్టారు.. ఆ సినిమా హీరోయిన్ తో సమంతకు ఎప్పటినుంచో కాంపిటీషన్ ఉంది.. పైగా సమంతకు ఆమెకు కూడా అస్సలు పడదట.. అందుకని చైతన్య కావాలనే ఆ అమ్మాయితో కలిసి సినిమా చేయడానికి సైన్ చేశాడని సమంత అనుకుంది.. ఇలా వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయట.. అయితే చైతు సమంత వాళ్ళిద్దరి మధ్య విడిపోవడానికి కారణం ఏంటి అని నోరు విప్పేదాకా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకు రావడంలో ఆశ్చర్యమే లేదు..